గురు పౌర్ణమి రోజు సెలవు ఎందుకు?


Fri,July 12, 2019 12:35 AM

Bihar when jdu mlc demanding leave on guru purnima cm nitish gives advice them

- మరో రెండు గంటలు అదనంగా పనిచేసి గురువులను గౌరవిద్దాం: నితీశ్‌కుమార్

పాట్నా: గురు పౌర్ణమినాడు సెలవు ప్రకటించాలన్న ఎమ్మెల్సీల విజ్ఞప్తిని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తిరస్కరించారు. అంతేగాక ఆ రోజు మరో రెండు గంటలు అదనంగా పనిచేసి తమ గురువులను గౌరవించాలని సూచించారు. గురువారం బీహార్ శాసనమండలి సమావేశం కాగానే సభ్యుడు సంజీవ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన గురు పౌర్ణమి ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరా రు. దీనికి అధికార జేడీఎస్ సభ్యులు కూడా మద్దతు ప్రకటించారు. దీంతో సీఎం నితీశ్‌కుమార్ కలుగజేసుకుంటూ గురు పౌర్ణమి రోజు సెలవు ప్రకటిస్తే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారని, అందుకే ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.

144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles