అవినీతి దవాఖానల పేర్లు వెల్లడిస్తాం

Wed,September 18, 2019 03:01 AM

-ఆయుష్మాన్ భారత్ అమలుపై కేంద్రమంత్రి హర్షవర్ధన్
-1200 కేసుల్లో రుజువైన అవినీతి
-338 దవాఖానాల తొలిగింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఆయుష్మాన్ భారత్ బీమా పథకంలో మోసాలకు, అవినీతికి పాల్పడిన దవాఖానల పేర్లను బహిరంగ పరుస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద సుమారు 1200 కేసుల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువైందన్నారు. 338 దవాఖానలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైఖరి మార్చుకోని 97 దవాఖానలను పథకం నుంచి తొలిగించామన్నారు. ఆరు దవాఖానలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, కొన్నింటిపై రూ.1.5 కోట్లకు పైగా జరిమానా విధించామని హర్షవర్ధన్ తెలిపారు. ఈ నెల 23 నాటికి ఈ పథకం ప్రారంభించి ఏడాది పూర్తవుతుందని, 15-30 మధ్య ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవం జరుపుతున్నట్లు హర్షవర్ధన్ చెప్పారు. ఈ నెల 30, అక్టోబర్ ఒకటిన ఆరోగ్య మంథన్ నిర్వహిస్తామని, ప్రధాని మోదీ పథకం అమలు పురోగతిని సమీక్షిస్తారన్నారు.

348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles