పుస్తకంగా ఏఎస్‌ఐ నివేదిక: ప్రహ్లాద్‌

Sun,November 10, 2019 01:10 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 9: అయోధ్య కేసు తీర్పులో కీలకంగా మారిన భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) నివేదికను త్వరలో పుస్తకంగా ముద్రిస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ చెప్పారు. 2003లో అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు శాఖ అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థలంలో తవ్వకాలు జరిపి ఓ నివేదికను రూపొందించిందని తెలిపారు. ప్రస్తుతం ఏఎస్‌ఐ నివేదిక సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని, కొద్ది రోజుల తర్వాత ఈ నివేదికను ప్రజల కోసం పుస్తక రూపంలో తీసుకొస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles