దేశ భద్రతలో రాజీ లేదు

Wed,September 18, 2019 02:47 AM

-ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఒక్క బుల్లెట్ పేలలేదు
-కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి
-కాంగ్రెస్ హయాంలో ప్రతి మంత్రీ ప్రధానేనని ఎద్దేవా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశ భద్రత విషయంలో రాజీ ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశ భూభాగంలోకి ఎవరైనా అక్రమంగా వస్తే సహించమని, దీటైన సమాధానమిస్తామని తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని, ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత భద్రత విషయంలో అస్సలు రాజీపడం. దేశ భూభాగంలో అంగుళం భూమిని ఆక్రమించాలని (శత్రువులు) చూసినా సహించం. ఇలాంటి పన్నాగాలకు గట్టిగా బుద్ధిచెబుతాం. అంతేకాదు మన సైనికుల శరీరంలో నుంచి ఒక్క చుక్క రక్తం నేలపాలైనా చూస్తూ ఊరుకోం అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జాతీయ భద్రతపై స్పష్టమైన ఓవిధానమంటూ లేకుండా పోయి ందని విమర్శించారు. పాకిస్థాన్‌పై మనం చేపట్టిన లక్షిత దాడులు, గగనతల దాడుల తర్వాత భారతపై ప్రపంచదేశాలకు ఉన్న అభిప్రాయం మారిందని, అంతర్జాతీయంగా మనం మరింత బలపడ్డామని అమిత్ షా తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా అఖండ భారత్ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ హయా ంలో ప్రజల్లో అసంతృప్తి ఉండేది. అంతేకాదు.. ప్రతి మంత్రి తానే ప్రధానిగా భావించేవారు. ప్రధానిని ప్రధానిగా చూసేవారు కాదు అని విమర్శించారు. 2014లో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రజలు నిర్మాణాత్మకమైన ప్రభుత్వాన్ని చూస్తున్నారన్నారు.

180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles