తదుపరి లక్ష్యం సూర్యుడు


Tue,July 23, 2019 03:11 AM

After Chandrayaan-2 launch, ISRO Plans Mission for Sun Next Year

- వచ్చే ఏడాది ఆదిత్య-ఎల్1 ప్రయోగం
- ప్రణాళికలు రచిస్తున్న ఇస్రో


న్యూఢిల్లీ: చంద్రయాన్-2 అనంతరం సూర్యుడిపై విస్తృత అధ్యయనానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. సూర్యుడి కరోనాపై పరిశోధనలకు వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో ఆదిత్య- ఎల్1 మిషన్‌ను చేపట్టేందుకు సమాయత్తమవుతున్నది. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. అక్కడ అంతటి ఉష్ణోగ్రతలు ఉండడానికి గల కారణమేంటో ఇప్పటి వరకూ తెలియదు. వాతావరణ మార్పులపై ప్రభావం చూపుతున్న కరోనాపై అధ్యయనం చేయడానికి ఆదిత్య- ఎల్1 ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కి.మీ. దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ చెప్పారు.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles