పీవీ సింధుతో పెండ్లి చేయండి!

Wed,September 18, 2019 02:44 AM

-లేకపోతే ఆమెను ఎత్తుకళ్లైనా వివాహమాడుతా
-70 ఏండ్ల వృద్ధుడి వింత కోరిక
-తమిళనాడులో ఘటన

చెన్నై, సెప్టెంబర్ 17: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేత, తెలుగు తేజం పీవీ సింధుతో తనకు వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏండ్ల వృద్ధుడు ఏకంగా జిల్లా కలెక్టర్‌కే విజ్ఞప్తి చేశాడు. అంతటితో ఆగకుండా.. సింధుతో పెండ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు కూడా సిద్ధమని పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. ఈ వింత ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జరిగింది. మలైస్వామి అనే వృద్ధుడు.. తనకు పీవీ సింధుతో పెండ్లి చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చాడు. సింధును పెండ్లి చేసుకోవాలనుకుంటున్నానని, వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే ఆమెను అపహరించి అయినా పెండ్లి చేసుకుంటానని దాంట్లో పేర్కొన్నాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. సింధు ఆటతీరు తనను ఎంతో ఆకట్టుకున్నదని, ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ పేర్కొన్న మలైస్వామి ... తమ ఇద్దరి ఫొటోలను జతచేసి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు. దీంట్లో మలైస్వామి ... తన వయస్సు కేవలం 16 ఏండ్లని పేర్కొన్నాడు.

2378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles