అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో రూ.264 కోట్లు జమ

Fri,November 8, 2019 02:10 AM

-తొలివిడుతగా రూ. 10 వేలలోపు నష్టపోయిన 3.7 లక్షల మందికి చెల్లింపు

అమరావతి: అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ.10 వేలకన్నా తక్కువ నష్టపోయినవారికి ఏపీ ప్రభు త్వం గురువారం డబ్బుల పంపిణీని ప్రారంభించింది. సీఎం జగన్మోహన్‌రెడ్డి తొలివిడుతలో 3.7 లక్షల మంది ఖాతాల్లోకి మొత్తం 264 కోట్లను బదిలీచేసే ఆన్‌లైన్ ప్రక్రియను గుంటూరులోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. ల్యాప్‌టాప్‌లో సీఎం జగన్ బటన్ నొక్కగానే వేల మంది ఖాతాల్లో డబ్బు జమ అయింది. సమావేశంలోనే పలువురు తమ సెల్‌ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లను చూపి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని, మిగతావారికి కూడా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.

302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles