ఫోన్‌లో మాట్లాడుతూ పాములపై కూర్చుంది..

Thu,September 12, 2019 12:20 PM

Talking On Phone Woman Sits On Snakes Gets Bitten And Dies

లక్నో : మొబైల్ ఫోన్‌లో మాటల్లో మునిగిపోయిన ఓ మహిళ.. పాములపై కూర్చుంది. దీంతో ఆమెను పాములు కాటేశాయి. కొద్ది నిమిషాల తర్వాత ఆ మహిళ చనిపోయింది. ఈ విషాద సంఘటన గోరఖ్‌పూర్‌లోని రియాన్వ్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.

గీత భర్త జైసింగ్‌ యాదవ్‌ థాయిలాండ్‌లో పని చేస్తున్నాడు. ఆమె తన భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ బెడ్‌పై కూర్చుంది. అప్పటికే బెడ్‌పై రెండు పాములు ఉన్నాయి. దీంతో ఆమె పాములపై కూర్చోవడంతో అవి కాటేశాయి. అనంతరం గీత అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. కొద్ది నిమిషాల్లోనే ఆమె ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న స్థానికులు.. గీత ఇంట్లో ఉన్న పాములను చంపేశారు. గీత మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

9065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles