అయోధ్య రాముడిదే.. మందిరం నిర్మాణానికి లైన్ క్లియర్

Sat,November 9, 2019 11:33 AM

న్యూఢిల్లీ: యావత్‌ భారత దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అత్యంత సున్నితమైన అయోధ్య రామజన్మభూమి, బాబ్రి మసీదు భూ వివాదంపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని కీలక తీర్పు చెప్పింది. సుప్పీం చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఏకగ్రీవ తీర్పునిచ్చింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ ఎస్‌ఎ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచుడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఎ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వ భూమి అని ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అదేవిధంగా ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని తుదితీర్పులో స్పష్టం చేసింది.


అయోధ్య తీర్పును గొగొయ్ స్వయంగా చదివి వినిపించారు. నమ్మకం, విశ్వాసం ఆధారంగా తీర్పు ఇవ్వలేమని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తెలిపారు. 'చాలా మంది చరిత్రకారులు, పర్యాటకులు కూడా అయోధ్యను రామజన్మభూమిగా నమ్ముతున్నారు. కానీ, నమ్మకం వ్యక్తిగతమైనదని, న్యాయ సూత్రాల ఆధారంగానే భూ హక్కులు కేటాయిస్తామని, ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అయోధ్య తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. '2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్ట్‌కి అప్పగించండి. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని' తీర్పులో వెల్లడించింది.

2362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles