భూమికి తమ్ముడు దొరికిండు!

Thu,September 12, 2019 02:34 AM

Water vapour detected on distant super Earth by UK scientists in 'world first' discovery

- సుదూర గ్రహం వాతావరణంలో నీటిజాడల గుర్తింపు
- ద్రవస్థితిలో జలం.. జీవానుకూల వాతావరణం ఉన్నట్టు నిర్ధారణ


పారిస్: మొట్టమొదటిసారిగా బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో గ్రహంపై నీటి జాడలను గుర్తించారు. కే2-18బీ అనే గ్రహంపై నీరు ద్రవస్థితిలో ఉన్నదని, ఉష్ణోగ్రతలు జీవం పెరుగడానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వీరి పరిశోధన వ్యాసం నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురితమైంది. కే2-18బీ గ్రహం భూమికి 110 కాంతి సంవత్సరాల దూరంలో ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతున్నదని లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన సహ రచయిత జియోవన్న టినెట్టి తెలిపారు. గ్రహం ఉపరితలం మొత్తం రాళ్లతో నిండి ఉన్నదన్నారు. అక్కడ నీరు సముద్రాల రూపంలో ఉన్నదని ఇప్పుడే చెప్పలేమన్నారు. నక్షత్రం-గ్రహం మధ్య ఉన్న దూరాన్ని బట్టి అక్కడి ఉష్ణోగ్రతలు జీవానుకూలంగా ఉన్నట్టు భావిస్తున్నట్టు చెప్పా రు. గతంలో సౌరవ్యవస్థ అవతల గ్రహాల్లో నీటి జాడలు గుర్తించినా అది ఆవిరి రూపంలో ఉందని, అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయని వివరించారు. కే2-18బీని మొట్టమొదటిసారిగా 2015లో గుర్తించారు.

468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles