ఫ్లోరిడాలో జిల్లా జడ్జిగా భారత సంతతి వ్యక్తి

Wed,September 11, 2019 02:03 AM

US trump nominates indian origin anurag singhal as a judge in florida

వాషింగ్టన్, సెప్టెంబర్ 10: భారతసంతతికి చెందిన అనురాగ్ సింఘాల్‌ను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జిల్లా జడ్జిగా నియమిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్.. సెనేట్‌కు పంపిన 17 న్యాయ నియామక ప్రతిపాదనల్లో సింఘాల్‌ది కూడా ఒకటి. ఫ్లోరిడాలోని దక్షిణాది జిల్లా జడ్జిగా ఉన్న జేమ్స్ ఐకోన్ స్థానంలోకి సింఘాల్ జడ్జిగా వెళ్లనున్నారు. ఫ్లోరిడాలో ఈ పదవిని చేపట్టనున్న మొదటి భారతసంతతి వ్యక్తి సింఘాల్. సెనేట్ న్యాయ కమిటీ ఆయన నియామకాన్ని బుధవారం లాంఛనంగా నిర్ధారించనున్నది. సింఘాల్ ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీలో సర్క్యూట్ కోర్టు జడ్జిగా పనిచేశారు.

221
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles