‘లండన్‌' ఉగ్రవాది గుర్తింపు

Sun,December 1, 2019 02:41 AM

లండన్‌: బ్రిటన్‌ రాజధాని లండన్‌ బ్రిడ్జి వద్ద శుక్రవారం కత్తితో ఇద్దరు వ్యక్తులను పొడిచి హత్య చేసి పోలీసు కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదిని ఉస్మాన్‌ ఖాన్‌గా గుర్తించారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో ఉగ్ర శిక్షణ శిబిరం ఏర్పాటుకు ప్రయత్నించడంతోపాటు, లండన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌పై బాంబు దాడి, ముంబై ఉగ్రదాడుల మాదిరిగా యూకే పార్లమెంట్‌పై దాడులకు ఏడేండ్ల కింద కుట్రపన్నిన కేసుల్లో అతడు జైలుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో పెరోల్‌పై విడుదలైన ఉస్మాన్‌ ఖాన్‌ శుక్రవారం కత్తితో దాడులకు పాల్పడి ఒక మహిళ, ఒక పురుషుడ్ని చంపి ప్రజలను భయాందోళనకు గురి చేసినట్లు చెప్పారు.

675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles