అమెరికాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

Tue,December 3, 2019 02:39 AM

-నవంబర్ 28న ఘటన

-మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు విరాళాలు సేకరిస్తున్న సహచరులు
వాషింగ్టన్: అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం సౌత్ నాష్‌విల్లే ప్రాంతంలో గత నెల 28న (థ్యాంక్స్ గివింగ్ డే) జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. వారిని జూడీ స్టాన్లీ (23), వైభవ్ గోపిశెట్టి (26)గా గుర్తించారు. వారిద్దరూ టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్‌లో ఫుడ్ సైన్స్ కోర్సు చదువుతు న్నారు. వీరు కారులో వెళ్తుండగా ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో కారు రోడ్డును దాటి చెట్టును ఢీకొట్టినట్టు చెప్పారు. స్టాన్లీ, వైభవ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన జీఎంసీ పిక్‌అప్ ట్రక్ యజమాని డేవిడ్ టోరెస్ కోసం లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశామని, దీంతో అతడు లొంగిపోయినట్లు మెట్రో నాష్‌విల్లే పోలీసులు తెలిపారు. విద్యార్థుల మృతి సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేశామన్నారు. మరోవైపు, విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు పంపించేందుకు వర్సిటీ విద్యార్థులు తమ వంతు సాయం చేస్తున్నారు. గో ఫండ్ మీ అనే పేజ్ ద్వారా 42,000 డాలర్లకుపైగా విరాళాలు సేకరించారు. శరత్ జూలకంటి అనే విద్యార్థి ఈ పేజీని క్రియేట్ చేశారు.

అభిషేక్ హంతకుడి లొంగుబాటు

అమెరికాలోని శాన్ బెర్నాండినోలో గత నెల 28న భారతీయ విద్యార్థి అభిషేక్ సుదేశ్ భట్‌ను కాల్చి చంపిన కేసులో నిందితుడు ఎరిక్ టర్నర్ శనివారం పోలీసులకు లొంగిపో యాడు. హత్య అభియోగాలపై అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మైసూర్‌కు చెందిన అభిషేక్.. గురువారం హోటల్ బయట ఉండగా టర్నర్ కాల్చిచంపిన సంగతి తెలిసిందే. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సుదేశ్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు అతడి స్నేహితులు 39,000 డాలర్లు సేకరించారు.

823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles