తాలిబన్లతో చర్చలు విరమించిన ట్రంప్

Mon,September 9, 2019 02:31 AM

Trump says he called off peace talks with Taliban over attack

వాషింగ్టన్: తాలిబన్లతో రహస్య చర్చలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరమించుకొన్నారు. గురువారం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు జరిపిన బాంబుదాడిలో అమెరికా సైనికుడితోపాటు 11 మంది చనిపోవడానికి నిరసనగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్లతోపాటు ఆఫ్ఘనిస్థాన్ ప్రభు త్వం ప్రతినిధులతో జరుపాలనుకొన్న చర్చల రద్దు వార్తను ట్విట్టర్ ద్వారా ట్రంప్ తెలిపారు. ఫలితంగా అమెరికా తన సుదీర్ఘ యుద్ధాన్ని ముగించి శాంతి ఒప్పందం చేసుకోవడానికి దగ్గరవుతున్న తరుణంలో జరుగుతున్న దీర్ఘకాలిక చర్చలకు విఘాతం కలిగినట్టయింది. 2001 సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడులు జరిగినప్పటి నుంచి తాలిబన్లపై అమెరికా యుద్ధం కొనసాగుతున్నది. కాగా, తాలిబన్లు, ఆఫ్ఘనిస్థాన్ ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టాలనుకొన్న రహస్య చర్చలను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రశంసించింది. తన మిత్రదేశాల హృదయపూర్వక ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపింది.

844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles