కశ్మీర్‌ అంశంలో మేము ఒంటరే!

Wed,August 14, 2019 01:33 AM

Shah Mahmood Qureshi says UN support won be easy after Russia backs India Article 370 decision

-పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ వెల్లడి
ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ అంశంలో పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ముస్లిం ప్రపంచ దేశాలు సిద్ధంగా లేవని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ అన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని ముజఫరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మీరు(పాక్‌ ప్రజలు) మూర్ఖుల స్వర్గంలో జీవించకండి. చేతిలో పూల దండలు పట్టుకొని ఎవ్వరూ మీకు మద్దతు పలకడానికి సిద్ధంగా లేరు. కశ్మీర్‌ అంశంలో ముస్లిం ప్రపంచదేశాలు కూడా పాక్‌కు మద్దతు ఇవ్వబోవు’ అని అన్నారు. ముస్లిం దేశాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయని, అందుకే ఆ దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వబోవని చెప్పారు.

513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles