సిరియాలో వైమానిక దాడులు.. 15 మంది మృతి

Tue,December 3, 2019 01:01 AM

మారెట్ అల్-నుమాన్: సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో తిరుగుబాటుదారుల స్థావరాలపై ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ సారథ్యంలోని దళాలు, రష్యా వైమానిక దళాలు సోమవారం వేర్వేరుగా జరిపిన బాంబుల దాడిలో 15 మంది పౌరులు మృతి చెందారు. ఇడ్లిబ్ పట్టణంలోని మార్కెట్ పరిధిలో బషర్ సారథ్యంలోని వైమానిక దళాలు జరిపిన బాంబు దాడిలో 13 మంది మరణించారు. ఈ ప్రాంతంలోని ఇతర ప్రదేశాల్లో రష్యా, బషర్ ప్రభుత్వ అనుబంధ బలగాలు జరిపిన మరో వైమానిక దాడిలో మరో ఇద్దరు మరణించారు. రెండు రోజుల్లో ఇడ్లిబ్ ప్రాంతంలో 100 మంది తిరుగుబాటుదారులు మరణించారని ఓ బ్రిటన్ సంస్థ తెలిపింది.

1017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles