పోలాన్‌స్కిపై లైంగికదాడి ఆరోపణలు

Sun,November 10, 2019 01:45 AM

పారిస్‌: ఆస్కార్‌ అవార్డు గ్రహీత, దర్శకుడు రోమన్‌ పోలాన్‌స్కిపై తాజాగా లైంగికదాడి ఆరోపణలు గుప్పుమన్నాయి. తాను యువతిగా ఉన్నప్పుడు ఆయన స్కై రిసార్టులో తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ప్రముఖ ఫ్రెంచ్‌ మోడల్‌, సినీ నటి వాలంటైన్‌ మొన్నియర్‌ ఆరోపించారు. ఫ్రెంచ్‌ యూదు ఆర్మీ ఆఫీసర్‌ ఆల్ఫ్రెడ్‌ డ్రేఫస్‌ హింసపై పోలాన్‌స్కి నిర్మిస్తున్న కొత్త చిత్రం వచ్చే వారం విడుదలకు సిద్ధమైన తరుణంలో 86 ఏండ్ల ఆయనపై లైంగికదాడి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ‘1975లో 18 ఏండ్ల వయసులో తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని లాస్‌ఏంజెల్స్‌ పోలీసులకు, ఫ్రెంచ్‌ గవర్నర్‌ బ్రిగెట్టే మాక్రాన్‌కు కూడా లేఖ ద్వారా విన్నవించానని వాలంటైన్‌ తెలిపారు. ఇన్నేండ్లు మౌనంగా ఉన్న తాను చివరకు ఈ దారుణంపై నోరువిప్పినట్లు చెప్పారు.

415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles