హాంకాంగ్‌వాసుల్లో చల్లారని ఆగ్రహం

Mon,December 2, 2019 02:08 AM

-మళ్లీ నిరసనలతో హోరెత్తించిన ఆందోళనకారులు
-బాష్పవాయువు, పెప్పర్‌స్ప్రే ప్రయోగించిన పోలీసులు

హాంకాంగ్‌, డిసెంబర్‌ 1: హాంకాంగ్‌లోని స్థానిక సంస్థలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూలవాదులు ఘనవిజయం సాధించినప్పటికీ చైనా నియంతృత్వ పోకడలపై అక్కడి ప్రజల్లో ఇంకా ఆగ్రహం చల్లారలేదు. దీంతో స్థానిక ఎన్నికలు ముగిసి వారంరోజులు తిరక్కుండానే మళ్లీ నిరసనలు హోరెత్తాయి. నల్లదుస్తులు ధరించిన వేలాదిమంది ఆందోళనకారులు ఆదివారం నగర వీధుల్లోకి పోటెత్తి చైనా నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును, పెప్పర్‌స్ప్రేను ప్రయోగించారు. హాంకాంగ్‌ హక్కులను హరించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై భయాందోళన వ్యక్తంచేస్తున్న హాంకాంగ్‌వాసులు గత ఆరు నెలల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం విదితమే. ఆదివారం జరిగిన మూడు నిరసన ప్రదర్శనల్లో సిమ్‌ షా సుయిలో జరిగిన ర్యాలీ ప్రధానమైనది. జిల్లాస్థాయి స్థానిక సంస్థలకు గత నెల 24న జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూలవాదులు ఘనవిజయం సాధించడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనకారులు ఈ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులు సహా అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రభుత్వం ఇప్పటికీ మా గోడును పట్టించుకోవడంలేదు. మా నిరసనలు కొనసాగుతాయి’ అని ఓ విద్యార్థి పేర్కొన్నాడు.

402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles