కర్తార్‌పూర్ దారిలో..

Wed,November 6, 2019 02:53 AM

-పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చేరిన 2వేల మంది భారత సిక్కులు
-ఈ నెల 9న కారిడార్‌ను ప్రారంభించనున్న ఇమ్రాన్
-12న గురునానక్ 550వ జయంతికి ముమ్మర ఏర్పాట్లు

లాహోర్: భారతీయ సిక్కు పర్యాటకులతో పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ కళకళలాడుతోంది. పంజాబ్ రాష్ట్రంలోని గురునానక్‌దేవ్ జన్మస్థలాన్ని సందర్శించేందుకు రెండో విడుతగా రెండు వేల మంది సిక్కులు మంగళవారం గురుద్వారా నంకానా సాహెబ్ చేరుకొన్నారు. వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్ చేరుకొన్న భారత సిక్కులకు ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ఈటీపీబీ) ఘనంగా స్వాగతం పలికింది. కర్తార్‌పూర్ కారిడార్‌ను 9న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి నిత్యం దాదాపు 5వేల మంది కర్తార్‌పూర్‌లోని గురునానక్ జన్మస్థలాన్ని సందర్శించనున్నారు. తొలి విడుతగా గత నెల 31న 1,100 మంది సిక్కులు పంజాబ్ గవర్నర్ చౌదరి సర్వర్ నేతృత్వంలో దర్బార్ సాహెబ్‌ను సందర్శించి బంగారు పాల్కిని అందజేశారు.

245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles