రాజీనామా తప్ప అన్ని డిమాండ్లూ తీరుస్తా

Wed,November 6, 2019 03:00 AM

-విపక్షాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ హామీ

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రాజీనామా కోసం మితవాద సంస్థ జమాత్ ఉలేమా ఏ ఇస్లామ్ ఫాజిల్ (జేయూఐ-ఎఫ్) అధినేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఇస్లామాబాద్‌లో చేపట్టిన ఆజాదీ మార్చ్ నిరసన మంగళవారానికి ఐదో రోజుకు చేరుకున్నది. రాజీనామా మినహా ప్రతిపక్షాలు చేసిన ఇతర డిమాండ్లన్నీ ఆమోదించేందుకు సిద్ధమని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. విపక్ష నేతలతో సంప్రదింపులు జరిపిన రక్షణమంత్రి పర్వేజ్ ఖట్టక్ కమిటీతో భేటీ తర్వాత ఇమ్రాన్‌ఖాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది.

1129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles