ఆరెస్సెస్‌, నాజీల సిద్ధాంతం ఒక్కటే: ఇమ్రాన్‌

Mon,August 12, 2019 01:24 AM

Pak PM Imran Khan Claims RSS Directed Modi Govt On Kashmir Move

ఇస్లామాబాద్‌: మోదీ సర్కారుపై పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నాజీ ఆర్యన్‌ ఆధిపత్య ధోరణిలాగే ఆరెస్సెస్‌ హిందూ ఆధిపత్య భావజాలం ఐవోకేతో (భారత ఆక్రమిత కశ్మీర్‌తో) ఆగదని నాకు ఆందోళన కలుగుతున్నది. ఇది భారత్‌లోని ముస్లింలను అణచివేయడమే కాకుండా, చివరకు పాకిస్థాన్‌నూ టార్గెట్‌ చేసుకునేందుకు దారితీస్తుంది’ అని ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ ఆధీనంలోని కశ్మీర్‌ను భారత్‌ ఆక్రమిత కశ్మీర్‌గా పాక్‌ సంబోధిస్తుంది. ‘నాజీ భావజాలంతో స్ఫూర్తిపొందిన ఆరెస్సెస్‌ భావజాలానికి అనుగుణంగానే ఐవోకేలో కర్ఫ్యూ, నిర్బంధం కొనసాగుతున్నాయి. కశ్మీరీల మారణహోమం జరుగుబోతున్నది. జాతి నిర్మూలన ద్వారా కశ్మీర్‌ జనాభా నిష్పత్తిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచం దీన్ని గమనిస్తుందా లేదా అన్నదే అసలు ప్రశ్న’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.

452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles