వాషింగ్టన్‌ను ముంచెత్తిన వానలు

Wed,July 10, 2019 02:16 AM

వైట్‌హౌస్ బేస్‌మెంట్ ఆఫీసుల్లోకి వరదనీరు


వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీని భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం కురిసిన కుండపోత వానలకు రహదారులన్నీ సంద్రాన్ని తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా, విద్యుత్ వ్యవస్థ స్తంభించింది. విమాన, రైలు సర్వీసులపైనా ప్రభావం పడింది. జాతీయ వాతావరణ సేవల సంస్థ వరద హెచ్చరికను జారీ చేసింది. పలు ప్రాంతాల్లో కార్లు నీటమునగడంతో వాటిలో ప్రయాణిస్తున్న వాళ్లు కార్లపైకి ఎక్కి సాయం కోసం అర్థించారు. సహాయ సిబ్బంది వారిని రక్షించారు. అమెరికా చరిత్రకు సంబంధించి కీలకమైన దస్ర్తాలను దాచి ఉంచిన నేషనల్ ఆర్కైవ్స్ భవనంలోకి వరద నీరు చేరింది. స్వాతంత్య్ర ప్రకటన, రాజ్యాంగం, హక్కుల బిల్లు తదితర అన్ని డాక్యుమెంట్లు భద్రంగా ఉన్నాయని ఆర్కైవ్స్ సంస్థ తెలిపింది. భారీ వర్షాల ప్రభావం వైట్‌హౌస్‌నూ తాకింది. అక్కడి బేస్‌మెంట్ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది.

1356
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles