విరాళాల్లో దూసుకెళ్తున్న కమలాహారిస్

Tue,July 9, 2019 02:34 AM

Kamala Harris Raises 23 Million Since Announcing US Presidential Bid

-ఆరు నెలల్లో 2.3 కోట్ల డాలర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి సెనెటర్ కమలా హారిస్ (54) గత ఆరు నెలల్లో 2.3 కోట్ల డాలర్లకు పైగా విరాళాలు సేకరించారు. ద్వితీయ త్రైమాసికంలో 2.79 లక్షల మంది నుంచి సుమారు 1.2 కోట్ల డాలర్ల విరాళాలు సేకరించారు. వారిలో 1.50 లక్షల మంది కొత్తవారు. డిజిటల్ చెల్లింపుల్లోనే 70 లక్షల డాలర్ల విరాళాలు లభించాయి. యుక్త వయస్కురాలిగా ఉన్న తన ఫోటోపై దట్ లిటిల్ గర్ల్ వాజ్ మీ అనే నినాదం ప్రచురించిన టీ-షర్టుల విక్ర యంతోనూ విరాళాలను సేకరిస్తున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లో జరిగే దేశాధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నట్లు ఈ ఏడాది జనవరి 21న కమల ప్రకటించారు. డెమోక్రాట్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న 23 మందికి ఆమె గట్టి పోటీనిస్తున్నారు. ట్రంప్ విధానాలపై నిశిత విమర్శలతో దేశ ప్రజలను ఆకర్షిస్తున్న కమ ల.. కార్పొరేట్ రాజకీయ కార్యాచరణ కమిటీలు, ఫెడరల్ లాబీయిస్టుల నుంచి విరాళాలను తిరస్కరిస్తానని వాగ్దానంచేశారు.

487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles