భారత్‌తో యుద్ధ ముప్పు

Sat,August 10, 2019 02:48 AM

Imran Khan says India creating war like situation MEA calls it a ploy

-కశ్మీర్‌పై ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నది
-పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్, ఆగస్టు 9: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. యుద్ధం వంటి పరిస్థితిని భారత్ సృష్టిస్తున్నదని ఆరోపించారు. పాకిస్థాన్‌కు చెందిన కొందరు జర్నలిస్టులతో ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడారు. పుల్వామా ఘటన అనంతర పరిణామాల మాదిరిగా కశ్మీర్‌లో ఏమి జరుగుతున్నది అన్నది తెలియకుండా ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. యుద్ధం ముప్పు నిజంగా పొంచి ఉంది. అలాంటి పరిస్థితిని మేము కచ్చితంగా ఎదుర్కొంటాం. ఇలాంటి కారణాలు రెండు దేశాల మధ్య గతంలో యుద్ధానికి ఎలా దారి తీశాయో మనం చూశాం అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతోనే ఆ రాష్ర్టానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై భారత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నదని ఆయన ఆరోపించారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు తాము చాలా ప్రయత్నించామని, అయితే భారత్ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు.
Raveesh-Kumar

3306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles