పాక్‌ నిబద్ధతకు నిదర్శనం

Sun,November 10, 2019 01:46 AM

చారిత్రక కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం.. ప్రాంతీయ శాంతికి పాకిస్థాన్‌ కట్టుబడి ఉన్నదనేందుకు నిదర్శనమని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. వేలాది మంది సిక్కుల సమక్షంలో నరోవాల్‌ పట్టణంలో శనివారం కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించారు. ప్రాంతీయ శ్రేయస్సు, రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకు ఇది బాటలు వేస్తుందని ఆకాంక్షించారు. కశ్మీర్‌ అంశాన్ని ఈ సందర్భంగా ఇమ్రాన్‌ లేవనెత్తారు. కశ్మీర్‌ వివాదం 70 ఏండ్లుగా ఇరుదేశాల మధ్య ద్వేషానికి కారణమైందని, ఆ వివాదానికి పరిష్కారం లభిస్తే ఇరుదేశాల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. నేడు తాము కేవలం సరిహద్దును మాత్రమే తెరువడం లేదని, సిక్కు ప్రజలకు తమ హృదయ ద్వారాలు తెరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ చారిత్రక దినం సందర్భంగా ఇరుదేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పంజాబ్‌ సీఎం అమరీంగ్‌ సింగ్‌ తదితర ప్రముఖులతో కూడిన భారత బృందం కూడా పాల్గొనది. ఈ సందర్భంగా మన్మోహన్‌తో ఇమ్రాన్‌ కరచాలనంచేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.

554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles