హాంకాంగ్‌లో జన ఘర్జన

Mon,July 8, 2019 01:47 AM

-చైనాను కలిపే వివాదాస్పదరైల్వే స్టేషన్‌ ముట్టడి
హాంకాంగ్‌, జూలై 7: హాంకాంగ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆందోళనకారులు ఆదివారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నేరస్థుల అప్పగింత చట్టం విషయంలో హాంకాంగ్‌ నేతలు చైనాకు అనుకూలంగా వ్యవహరించడంపై మండిపడుతున్న ఆందోళనకారులు.. హాంకాంగ్‌ నగరాన్ని చైనా ప్రధాన భూభాగంతో కలుపుతున్న వివాదాస్పద రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చైనా పాలకుల అభీష్ఠం మేరకు రూపొందించిన నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని, హాంకాంగ్‌ సీఈవో పదవి నుంచి కారీ లామ్‌ (ప్రజలు ఎన్నుకోని నేత) వైదొలగాలని, అరెస్టు చేసిన ఆందోళనకారులను విడుదల చేయడంతోపాటు తమపై బాష్పవాయు గోళాలను, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించిన పోలీసులపై స్వతంత్ర విచారణ జరిపించాలని నినాదాలతో హోరెత్తించారు.

492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles