ఇరాన్‌లో బ్రిటన్‌ రాయబారి అరెస్ట్‌

Mon,January 13, 2020 01:08 AM

-ధ్రువీకరించిన బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి
లండన్‌: బ్రిటన్‌ రాయబారి రాబ్‌ మాకైర్‌ను ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో అక్కడి ప్రభుత్వం శనివారం అదుపులోకి తీసుకొన్నది. గంటపాటు అదుపులో ఉంచుకొని తర్వాత విడిచిపెట్టారని బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి డోమ్నిక్‌ రాబ్‌ ధ్రువీకరించారు. ఇరాన్‌లో ఆందోళనలు తీవ్రంగా ఉన్నప్పుడు తమ రాయబారిని అరెస్ట్‌ చేయడం పట్ల బ్రిటన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆధారాలు చూపకుండా, వివరణ కోరకుండా తమ రాయబారిని అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని డోమ్నిక్‌ రాబ్‌ అన్నారు. ప్రమాదవశాత్తు ఉక్రెయిన్‌ జెట్‌ విమానం కూల్చివేతపై నిరసనకారులు తమ ఆందోళనలను ఉధృతం చేసేందుకు ప్రేరేపిస్తున్నాడన్న ఆరోపణలతో బ్రిటన్‌ రాయబారి రాబ్‌ మాకైర్‌ను ఇరాన్‌ ప్రభుత్వం అదుపులోకి తీసుకొన్నదని అక్కడి దినపత్రిక డైలీ మెయిల్‌ పేర్నొన్నది. ఈ విమానం కూలిన ఘటనలో 176 మంది మృత్యువాతపడ్డ తెలిసిందే. ఇరాన్‌ ప్రజలకు తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles