దావూద్ తోక కత్తిరించండి

Thu,July 11, 2019 02:05 AM

-ఐరాస భద్రతామండలిని కోరిన భారత్
ఐరాస: పాకిస్థాన్ కేంద్రంగా నేర కార్యకలాపాలు సాగిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన క్రిమినల్ సిండికేట్.. టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌గా రూపాంతరం చెందిందని ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. దావూద్‌కు చెందిన డీ-కంపెనీతోపాటు నిషేధిత జైషే మహమ్మద్, లష్కరే తాయిబా తదితర ఉగ్రవాద సంస్థల నుంచి భారత్‌కు ముప్పు ఉన్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు ఐరాస భద్రతా మండలి దృష్టిసారించాలని అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు: అంతర్జాతీయ ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలకు మధ్య సంబంధాలు అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ చెప్పారు. దావూద్ తమ దేశంలోనే ఉన్నాడని ఒప్పుకునేందుకు నిరాకరిస్తున్న స్వర్గధామం (పాకిస్థాన్)నుంచి అతడు ఈ నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అని పేర్కొన్నారు.

840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles