బీబీసీ టాప్‌ -100 నవలల్లో ముగ్గురు భారతీయులకు చోటు

Thu,November 7, 2019 01:04 AM

లండన్‌: ‘ప్రపంచాన్ని మార్చిన 100 నవలలు’ పేరుతో బీబీసీ రూపొందించిన జాబితాలో పేరొందిన భారతీయ రచయితలు ఆర్కే నారాయణ్‌, అరుంధతీ రాయ్‌, విక్రంసేథ్‌తోపాటు భారతీయ మూలాలు ఉన్న సల్మాన్‌ రష్దీ రాసిన నవలలకు చోటు దక్కింది. టైమ్స్‌ సాహిత్య విభాగం ఎడిటర్‌ స్టిగ్‌ అబెల్‌, బ్రాడ్‌ఫోర్డ్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ స్యిమా అస్లాం, నవలా రచయితలు జునో డావ్సన్‌, కిట్‌ డీ వాల్‌, జర్నలిస్టు మారైల్లా ఫ్రోస్ట్రఫ్‌, రచయిత-విద్యావేత్త అలెగ్జాండర్‌ మైక్‌ కాల్‌ స్మిత్‌లతో కూడిన న్యాయ నిర్ణేతల కమిటీ.. అత్యంత స్ఫూర్తిదాయక ఇంగ్లిష్‌ నవలలను ఈ జాబితా కింద ఎంపిక చేసింది. ఐడెంటిటీ క్యాటగిరీలో అరుంధతీ రాయ్‌ రాసిన తొలి నవల ‘ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌', కమింగ్‌ ఏజ్‌ విభాగంలో ఆర్కే నారాయణ్‌ ‘స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌', రూల్‌ బ్రేకర్స్‌ విభాగంలో రష్దీ రచన ‘ది మూర్స్‌ లాస్ట్‌ సై’, ఫ్యామిలీ అండ్‌ ఫ్రెండ్స్‌ క్యాటగిరీలో నవలా రచయిత-కవి విక్రమ్‌ సేథ్‌ ‘ఏ సూటబుల్‌ బాయ్‌' నవలలను కమిటీ ఎంపిక చేసింది.

523
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles