అమెజాన్ కార్చిచ్చు.. తీవ్రమైన అత్యయిక స్థితి!

Sat,August 24, 2019 02:17 AM

Amazon fires Brazil threatened over EU trade deal

-జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ఆందోళన
-జీ7లో ప్రధాన ఎజెండాగా చర్చించనున్నట్టు వెల్లడి

బెర్లిన్, ఆగస్టు 23: కార్చిచ్చుతో అమెజాన్ తగులబడిపోతున్నది. వేలాది ఎకరాల్లో అడవులు బుగ్గిపాలవుతుండటంతో వాతావరణంపై ఇది తీవ్ర ప్రభావం చూపనున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అమెజాన్ అడవుల్లో నెలకొన్న పరిస్థితిపై జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ స్పందించారు. ఈ విపత్తును తీవ్రమైన అత్యయిక స్థితిగా అభివర్ణించారు. అమెజాన్ కార్చిచ్చు అంశాన్ని ఈ వారాంతంలో జరిగే జీ7 సమావేశంలో పాల్గొనే ప్రపంచ దేశాల అధినేతలతో ప్రధాన ఎజెండాగా చర్చించనున్నట్టు తెలిపారు. ఈ నెల 14న బ్రెజిల్‌లోని ట్రాన్స్-అమెజానియా హైవేలో కొన్ని కిలో మీటర్ల విస్తీర్ణంలో మొదలైన ఈ మంటలు వారం రోజుల వ్యవధిలోనే ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఎన్నో అరుదైన వృక్షజాతులు మంటల్లో ఆహుతవుతుండడం ప్రకృతి ప్రేమికులను కలిచివేస్తున్నది.

330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles