ఆఫ్ఘన్‌లో బస్సుపై బాంబు దాడి.. 10 మంది మృతి

Tue,October 8, 2019 01:03 AM

కాబూల్‌, అక్టోబర్‌ 7: ఆఫ్ఘనిస్థాన్‌లో మరో రక్తపాతం చోటుచేసుకున్నది. ఆర్మీలోకి కొత్తగా చేరినవారు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు దాడి జరిగింది. సోమవారం జలాలాబాద్‌ వద్ద జరిగిన ఈ ఘటనలో పది మంది మరణించగా 27 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు నాన్గార్హర్‌ గవర్నర్‌ ప్రతినిధి అతతుల్లా ఖోగ్యాని తెలిపారు. బాంబును మోటార్‌ సైకిల్‌లో అమర్చారని, బస్సు దాని సమీపంలోకి రాగానే పేల్చివేశారని ఆయన చెప్పారు. ఆర్మీ రిక్రూటర్లలో ఎంత మంది గాయపడ్డారన్నది తెలియరాలేదన్నారు. తాలిబన్లే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

527
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles