అక్షయపాత్రను మట్టిపాలు చేయొద్దు


Fri,October 18, 2019 01:29 AM

rtc-luxury
జీవితాంతం కలిసిమెలిసి ఒకే కప్పు కింద కాపురం చేసే భార్యాభర్తల మధ్యన అప్పుడప్పుడు పొరపొచ్చాలు వస్తుంటాయి. అలాంటి అభిప్రాయ భేదాలు వచ్చిన ప్పుడు వారే కలిసి మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఇది లోక సహజం. అంతే తప్ప వీధికెక్కి ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్లి తమ ఇంటిగుట్టు వారితో చెప్పుకోరు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సకలజనుల సమ్మె జరిగిన ప్పుడు అందులో ఆర్టీసీ కూడా భాగస్వామి. రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేసిన ఉద్యమాన్ని తక్కువ చేయలేం. ఆ సమ్మెలో ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు దాదాపు నాలుగు లక్షల మంది పాల్గొన్నారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం క్రెడిట్‌ ఒక్క రవాణా సంస్థ కార్మికులకు మాత్రమే దక్కదు. అప్పుడు వారు పోరాడింది సమైక్య పాలకుల మీద. కానీ, ప్రస్తుతం పాలిస్తున్నది స్వజాతీయులే తప్ప అన్యులు కారు. ఈ పాయింట్‌ మీదనే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజామద్దతు లభించడం లేదు. మన కంటిని మన వేళ్లతోనే పొడుచుకుంటామా? అని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఏ రంగంలోనైనా, కార్మికులకు అనేక సమస్యలు ఉంటాయి. వాటిని కార్మిక సంఘాల ద్వారా యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించుకుంటారు. సమస్యలు అన్నీ ఒకేసారి తీర్చడం ఎవరివల్లా కాదు. కార్మికులు కూడా అంత దురాశకు పోరు. మధ్యేమార్గంగా ఎక్కడో ఒక్కచోట రాజీకి వస్తారు. ఇక్కడ ఆర్టీసీ అనేది ఇతర శాఖల వంటిది కాదు. ప్రభుత్వంలోని ఇతర శాఖల ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి తమ విధులను నిర్వహించి సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోతారు. కానీ, ఆర్టీసీ విధులు ప్రజలతో పెనవేసుకున్నవి. ప్రతిరోజూ కోట్లాది మందిని వారి గమ్యాలకు చేర్చడం వారి విధి. ఈ విధి నిర్వహణలో వారికి ప్రజలతో ఒకరకమైన ఆత్మీయ సంబంధాలు ఏర్పడుతాయి. కండక్టర్‌, డ్రైవర్‌ అంటే ప్రజల్లో ఏదో చెప్పలేని అభిమానం ఉంటుంది.


హైకోర్టు తమ తీర్పులో ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారం కార్మికుల సమస్యలు ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కారం కావాలి తప్ప, పనిలేని ప్రతిపక్షాల జోక్యం అవసరం లేదు. పన్నెండు రోజుల సమ్మె తర్వాత కూడా కార్మికుల సమ్మెను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. వారి తిప్పలు
వారు పడుతున్నారు తప్ప ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టడం లేదు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను అనాథలను చేశారు. కాబట్టి కార్మికసంఘాలు, ప్రభుత్వం భేషజాలు వదులుకొని కలిసి కూర్చుని సామరస్యంగా ప్రజాక్షేమాన్ని, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రగతి రథచక్రాలను రహదారుల మీదికి ఎక్కించడం తక్షణ కర్తవ్యం.


కండక్టర్‌ సీటు పక్కనే కూర్చోవడం, డ్రైవర్‌ బస్సును నడుపుతున్నప్పుడు అతనితో రెండు మాటలు మాట్లాడటం అంటే అదేదో చాలా గొప్ప విషయంగా భావిస్తారు ప్రయాణికులు. వారిద్దరూ ప్రయాణికులను కోపంగా మందలించినా, వారి మాటలను సీరియస్‌గా తీసుకోరు. దారి లో ఎక్కడైనా హోటల్‌ ముందు బస్సును ఆపి కాఫీ, టిఫిన్లకు ఆపినప్పుడు డ్రైవర్‌, కండక్టర్‌ దగ్గర హోటల్‌ వాళ్లు డబ్బులు తీసుకోరు. అదీ ప్రజాబాహుళ్యంలో వారికి లభించే గౌరవం. ఇప్పుడు వారు చేస్తున్న యుద్ధం ప్రభుత్వం మీదనా? తమను గౌరవించే ప్రయాణికుల మీదనా? జీతాలు ఎక్కువో తక్కువో నేను చెప్పలేను కానీ, తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నందుకు కృతజ్ఞతగా ఆర్టీసీ కార్మికులకు వారు అడుగకుండానే ఒకేసారి నలభై నాలుగు శాతం జీతాలు పెంచారు కేసీఆర్‌. అలాగే పదహా రు శాతం ఇంటెరిమ్‌ రిలీఫ్‌ కూడా ఇచ్చారు. ఇంత భారీగా జీతాలు పెం చడం ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి కావచ్చు. వారికి ఇంకా డిమాండ్స్‌ ఉంటే నేరుగా ముఖ్యమంత్రితో కూర్చొని చర్చించగలరు. కానీ, ఇక్కడ దురదృష్టం కొద్దీ కార్మిక సంఘాలు విపక్షాల మాయమాటల్లో పడ్డాయి. ప్రజల చేత మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా తిరస్కరించబడిన పక్షాల నాయకులకు కార్మికుల ఆకలి కేకలు మధుర సంగీతంలా వినిపిస్తున్నాయి. వారి ఆకలి బాధలను తీర్చే శక్తి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తప్ప విపక్షాలకు ఉంటుందా? ఏదోవిధంగా కేసీఆర్‌ను ఆగం పట్టిద్దామనే దురుద్దేశం తప్ప ప్రతిపక్షాలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించగలవా? ప్రభు త్వం, కార్మికసంఘాల మధ్య మరిన్ని మంటలు రాజేయ డం, ఆ మంటల్లో రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడం తప్ప ప్రతిపక్షాలు కార్మికుల సమస్యలను తీర్చలేవు. ఇప్పటికే హైకోర్టు తమ తీర్పులో ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు కొన్ని సూచనలు చేసింది.
murali-mohan-Ilapavuluri
ఆ సూచనల ప్రకారం కార్మికుల సమస్యలు ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కారం కావాలి తప్ప, పనిలేని ప్రతిపక్షాల జోక్యం అవసరం లేదు. పన్నెండు రోజుల సమ్మె తర్వాత కూడా కార్మికుల సమ్మెను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. వారి తిప్పలు వారు పడుతున్నారు తప్ప ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టడం లేదు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను అనాథలను చేశారు. కాబట్టి కార్మికసంఘాలు, ప్రభుత్వం భేషజాలు వదులుకొ ని కలిసి కూర్చుని సామరస్యంగా ప్రజాక్షేమాన్ని, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రగతి రథ చక్రాలను రహదారుల మీదికి ఎక్కించడం తక్షణ కర్తవ్యం. ఒకరినొకరు దెప్పిపొడుచుకోవడం, విమర్శించుకోవడం ఏ మాత్రం ప్రయోజనకరం కాదు.
(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)

427
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles