శాశ్వత పరిష్కారమే మార్గం


Thu,October 17, 2019 12:08 AM

గత శతాబ్దపు మొదట్లో ప్రపంచంలో ఎక్కువమంది సామ్యవాద కలలుగన్నారు. ఏ రకమైన దోపిడీ ఉండకుండా ఉం డాలంటే ఉత్పత్తి శక్తులన్నీ ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని, ఎవరికీ వ్యక్తిగత ఆస్తి ఉండకూడదనుకున్నారు. మొదటి ప్రపంచయుద్ధం అయిపోయేటప్పటికి ఒక సామ్యవాద ప్రభుత్వం ఏర్పడింది. రెండవ ప్రపంచయుద్ధం అయ్యేసరికి సామ్యవాద దేశాల సంఖ్య 15 దాకా పెరిగింది. అది 25 దాకా పెరిగినా త్వరలోనే భ్రమలు పటాపంచలయ్యాయి. చివరికి ప్రజాస్వామ్యమే లేని దేశాలుగా మారి నియంతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. త్వరగానే ప్రజలు ఈ ఘోరాన్ని తెలుసుకున్నారు. బెర్లిన్‌ గోడను కూల్చివేశారు. రెండు మూడు దేశాలు సోషలిస్టు దేశాలమని చెప్పుకుంటున్నా అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ నియంతల చేతుల్లో ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే.


దేశంలో పీవీ నర్సింహారావు తెగించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి ప్రైవేట్‌ అనలేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పర్చి వాటి కి రవాణా శాఖ బస్సులను, విద్యుత్తు, వగైరాలను అప్పగించారు. అంటే అటువంటి కార్పొరేషన్లు తమ కాళ్లమీదనే అవి నిలబడాలి. వాటి ఖర్చులను, అందులోని ఉద్యోగుల జీతాలు అవే సంపాదించుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్‌ సంస్థలు 90 శాతం కన్నా ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం ఇంకా బేరం పనిలో ఉండాలని కోరేవారు ఈ దేశ ప్రజల సౌకర్యాలను కోరుకోవటం లేదు. ఈ దేశపు అభివృద్ధికి కూడా వారు కావాలనే అడ్డుతగులుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపాలనే కోరికను కూడా ఈ నేపథ్యంలోంచే చూడాలి.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం నిశ్చయంగా వెనుకడుగే. ప్రపంచమంతా ప్రభుత్వాలు బేరసారాల్లో ఉండకూడదనుకుంటున్నాయి. కేంద్రంలో ఇప్పటిదాకా 20 పార్టీలు వివిధ సందర్భాల్లో అధికారంలోకి వచ్చాయి. అన్ని పార్టీలు ఏటా కొద్దో గొప్పో ప్రభుత్వరంగ ఆస్తులను అమ్ముతూనే ఉన్నాయి. ఈ ధోరణికి ఇది పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. పని చేయలేని కార్మికులను దేశమంతటా రెచ్చగొట్టినట్లు అవుతుంది. బస్సు ప్రయాణికులు ఎప్పుడైనా ఇది ఒక సంస్థగా కాకుండా ప్రభుత్వంలో ఒక శాఖగా ఉండాలని కోరారా? ఒక వినతి పత్రాన్ని ఇచ్చారా? ఈ కోరిక ఉద్యోగుల నుంచి మాత్రమే వస్తున్నది ఎందుకు? వారు బస్సులను నడిపి, సంపాదించి బడుగువర్గాలకు సహాయం చేద్దామనా? కానేకా దు. ఇప్పుడు వారి జీతాలను ఆర్టీసీ భరిస్తున్నది. ఉద్యోగుల సామర్థ్యలేమి వల్ల జీతాలను సంస్థ భరించలేని పరిస్థితి ఏర్పడుతున్నది.

జీతాల పరిస్థితే ఇలా ఉంటే జీతాల పెరుగుదల ఎక్కడ. పరిస్థితి ఇలాగే ఉంటే ఉద్యోగ భద్రత కూడా ముప్పులో పడ్డట్లే. అదే ప్రభుత్వంలో ఒక శాఖ అయితే ఇక ఆదాయంతో సంబంధమే ఉండదు. ప్రభుత్వ దవాఖానలు, రోడ్లశాఖ, నీటి పారుదల శాఖ లాంటివి ఖర్చు పెట్టేటప్పుడు ఆదాయాన్ని గురించి ఆలోచించవు. అలానే బస్సు వ్యవస్థ కూడా ఉంటే సమ్మె చేసి, ఒత్తిడిని తెచ్చి తమ గొంతెమ్మ కోరికలను సాధించుకోవచ్చు. ఎంత అసమర్థంగా పని చేసినా ఉద్యోగ భద్రతకు ముప్పే లేదు. ఆర్టీసీలో జీతం సరిగా రావటం లేదనీ, జీతాలను సరిగా పెంచటం లేదనీ, ఉద్యోగ భద్రత, పింఛన్‌ లేదనీ ఉద్యోగులు అంటున్నారు. జీతాలు సరిగా రావకపోటానికి కారణం సరైన ఆదాయం వచ్చేట్లు ఉద్యోగులు కావలిసిన పనిచేయకపోవటమే. జీతాల ను పెంచకపోవటానికి కారణం కూడా అదే.

ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు చేస్తున్న సమ్మె న్యాయసమ్మతమైనదేనా అంటే, కాదనే చెప్పాలె. న్యాయస్థానాలు కూడా అలాంటి సమ్మెలను చేయకూడదని తీర్పులు ఇచ్చాయి. చట్టబద్ధంగా ఉద్యోగులు నడువదలుచుకుంటే ముందు న్యాయబద్ధతను కోర్టులో తేల్చాలి. తరువాత సమ్మెలోకి దిగాలి. ఎవరైనా సమ్మెకు దిగేముందే ఆలోచించాలి తమ పరిస్థితి గురించి.


ఈ ఉద్యోగులు పదవీవిరమణ చేశాక వీరికి జీవితాంతం జీతం లాగ పింఛన్‌ ఇస్తూనే ఉండాలనటం అసమంజసం. పనికి సంబం ధం లేకుం డా చెల్లింపులుంటే ఆర్థికమైన అభివృద్ధి ఉండదు. ప్రభుత్వ ఆదాయాన్ని ఇలా చెల్లిస్తుంటే ఆ రాష్ట్రం కూడా వెనుకబడిపోతుంది.

అసలు జీతాలు ఎలా నిర్ణయించబడుతాయో మనం కొంత గమనించాలి. ఒక ఉద్యోగి తొలిగిపోతే వేరే ఉద్యోగి రూ.10 వేలకు వచ్చే అవకా శం ఉండగా లక్ష రూపాయలు ఇచ్చి ఉద్యోగిని తీసుకోరు. ఏదైనా కృత్రిమ ఏర్పాట్లతో లక్ష రూపాయలు ఇస్తే అటువంటి సంస్థలు ఎక్కువకాలం ఆ కొనసాగవు. అటువంటి కృత్రిమ వ్యవస్థలు ఈ ప్రపంచపోటీలో బతుకలే వు. మార్కెట్‌ రేట్‌ కన్నా ఎక్కువ జీతం ఇస్తే ఆ దేశం తన సరుకులను, సేవలను అందించటంలో ఇతర దేశాలతో పోటీపడలేదు. తక్కువ జీతం ఇస్తే నీ మనుషులు ఇతర వ్యవస్థలకు, దేశాలకు పారిపోతారు.

నిజంగా ఈ సమ్మె చేస్తున్న ఉద్యోగులకు తక్కువ జీతాలు వస్తుంటే వారు ఈ సంస్థలో పనిచేయటం మానివేయవచ్చు. కానీ వారికి తెలుసు వారు బయటకుపోతే ఇంతకన్నా తక్కువ జీతానికి పనిచేసేవారు సంస్థకు దొరుకుతారు. వారికి మాత్రం బయట పనే దొరుకదు. అందుకని వారు ఈ సంస్థ గుత్తాధిపత్యాన్ని వాడుకొని, పండుగరోజుల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వం మీద ఒత్తిడిని తెచ్చి పబ్బం గడుపుకోవాలని చేస్తున్న ఆలోచనే ఈ సమ్మె. ఏ మాత్రం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత ఉన్న ప్రభుత్వమైనా ఇలాంటి ఒత్తిడికి లొంగకూడదు.

ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు చేస్తున్న సమ్మె న్యాయసమ్మతమైనదేనా అంటే, కాదనే చెప్పాలె. న్యాయస్థానాలు కూడా అలాంటి సమ్మెలను చేయకూడదని తీర్పులు ఇచ్చాయి. చట్టబద్ధంగా ఉద్యోగులు నడువదలుచుకుంటే ముందు న్యాయబద్ధతను కోర్టులో తేల్చాలి. తరువాత సమ్మెలోకి దిగాలి. ఎవరైనా సమ్మెకు దిగేముందే ఆలోచించాలి తమ పరిస్థితి గురించి. ముందుచూపు లేకుండా చేస్తే పశ్చాత్తాపపడుతారు. సమ్మె చేయటానికి ప్రధాన కారణం సంఘాల గుత్తాధిపత్యమే. దానికి శాశ్వత చికిత్సకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు ముదావహం. ఆర్టీసీలో 20 శాతం కాదు, 50 శాతం వరకు ప్రైవేట్‌ స్టేజీ క్యారీర్ల ను అనుమతించాలి. దానివల్ల ప్రభుత్వానికి, బ్యాంకులకు, బడుగువర్గాలకు, ప్రయాణికులకు మేలు జరుగుతుందన డంలో సందేహం లేదు.

ఈ చట్ట వ్యతిరేక సమ్మెను తగురీతిలో పరిష్కరించి ఇటువంటి సమ్మె మళ్ళీ జరుగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బడుగువర్గా ల డబ్బులు అనవసరంగా ఖర్చుచేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరై న, శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటారని ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజ లు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

- కోదండరామయ్య పారుపల్లి

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles