ప్రజలు పట్టించుకోరు


Sat,October 12, 2019 01:18 AM

రాష్ర్టానికి కేంద్రం నుంచి జాతీయ ప్రాజె క్టు గురించి, పెండింగ్ నిధుల గురించి రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్నడూ మాట్లాడిన దాఖలాల్లేవు. కానీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ తామే ప్రత్యామ్నాయమ ని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఏవైనా లోపాలు ఉంటే విధానపరమైన విమర్శలు చేయవ చ్చు. తగిన సలహాలు ఇవ్వవచ్చు. కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఢిల్లీ బీజే పీ నేతల మెప్పు కోసం చేస్తున్న ప్రయత్నా లను ప్రజలు హర్షించరు. రాష్ర్టాభివృద్ధిని కాంక్షించేవారు రాష్ట్ర ప్రయోజనాల గురిం చి కూడా మాట్లాడాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. కానీ కేవలం విమర్శలకే పరిమితమైతే ప్రజలు పట్టించుకోరు. ఎలాంటి ఫలితమూ ఉండదు.
-బి. సంపత్, వరంగల్


ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలి

ప్లాస్టిక్ వల్ల ఎదురవుతున్న అనర్థాలు మనకు తెలిసిందే. లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నా యి. దీనివల్ల జీవవైవిధ్యం దెబ్బతినడమే కాదు, మానవాళికి కూడా ముప్పు ఏర్పడుతుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల భూతాపాలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల అనేక ఉపద్రవాలు మనం ఇప్ప టికే చవిచూడాల్సి వచ్చింది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ను నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- రామిళ్ల రమేశ్, హైదరాబాద్

అప్పుడే మార్పు సాధ్యం

రాష్ట్ర విద్యాధికారులు ప్రాథమిక విద్య బలోపేతానికి కృషిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు తీసు కుంటున్నది. కానీ ఇంకా అక్కడక్కడా లోపాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రాథమికస్థాయిలో విద్యాభివృద్ధిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కాబట్టి అధికారులు ప్రాథమిక విద్య బలోపేతానికి తగిన కార్యాచరణ రూపొందించాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది.
- పి.లక్ష్మణ్, మహబూబ్‌నగర్

70
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles