గురువులకు నిరంతర శిక్షణ


Sun,September 22, 2019 01:28 AM

బ్రిటిష్ కాలం నుంచి భారతదేశంలో విద్యావిధానం లోపభూయిష్టం గా ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల తో పోలిస్తే మన దేశం అథమ స్థానంలోనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో మన దేశంలోని ఏ విద్యా సంస్థ, విశ్వవిద్యాలయం టాప్ 200 స్థానంలోపు లేదు. దేశంలోని విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్, కొఠారీ కమిషన్, ఈశ్వరీబాయి కమిషన్, 1986 జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యా స్థాయి వరకు పలు సంస్కరణలు చేపట్టారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. గత ప్రభుత్వాలు అమలుచేసిన సంపూ ర్ణ అక్షరాస్యతా కార్యక్రమాలు, జిల్లా ప్రాథమిక విద్యా పథకం, ఆపరేషన్ బ్లాక్ బోర్డు, సర్వశిక్షా అభియాన్, సమగ్ర శిక్షా అభియాన్, రాష్ట్రీయ, మాధ్యమిక శిక్షా అభియాన్‌లు ఉన్నత, సెకండరీ స్థాయి వరకు సక్రమంగా అమలుచేయలేదు. దీంతో వందశాతం ఫలితాలు సాధించడంలో విఫలం అయ్యాం. ప్రధానంగా దేశంలో కేంద్ర ప్రభుత్వాలు జీడీపీలో విద్యకు ఆరు శాతం నిధులు కేటాయించడం లేదు. అట్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదు. విద్యా విధానాల రూపకల్పన, అమలులో అలసత్వం ప్రధాన కారణం. గతంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం నుంచి నేటి వరకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభ్యున్నది సాధించాం. అయినప్పటికీ దేశంలో ఆశించిన స్థాయిలో అక్షరాస్యత లేదు. విద్యావ్యాప్తికి, గుణాత్మక విద్యను అందించడానికి ఉపాధ్యాయుల్లో ఆశించినస్థాయిలో తమ వృత్తి నైపుణ్యాల కొరత, వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించకపోవడం, ఉపాధ్యాయ వృత్తి పూర్వ, వృత్త్యంతర శిక్షణా కార్యక్రమాల్లో నాణ్యత తగ్గడమూ ప్రధానంగా మనం గమనించవచ్చు.


ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తున్న వారు తమ మేధో సంపత్తిని పెంపొందించుకోవాలి. తమ జీవితకాలంలో కనీసం నాలుగు తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి నిత్య విజ్ఞానార్జన కోసం కృషి చేస్తూ విద్యార్థుల భవితకు మంచి దారులు వేయాలి.


స్వాతంత్య్రానంతరం ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానంలో, ఉపన్యాస పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించడం. పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాల ప్రచురణ, ఆచరణకు నోచుకోని ప్రయోగాలు, నాణ్యత తగ్గిన ఉపాధ్యా య విద్యా ప్రమాణాలు ప్రధాన కారణం. తదనంతరం 1986 నుంచి విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులచే విద్యాబోధన శ్రవణ-దృశ్య పరికరాలను ఉపయోగించారు. ప్రయోగపద్ధతిలో, కృత్యాత్మక బోధనా పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించారు. అయినా తగిన నిధులు కేటాయించలేదు. పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాలు విద్యార్థి కేంద్రీకృత కృత్యాత్మక బోధనకు అనుకూలంగా లేవు. వీటికితోడు ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించేందుకు సరైన పర్యవేక్షణ లేదు. ఉపాధ్యాయులకు అవసరమైన వృత్తికి సంబంధించిన సందేహాల నివృత్తికి ఉన్నతాధికారులు లేరు. గుణాత్మక విద్యను అందించడానికి ఉపాధ్యాయ విద్యను అందిస్తున్న ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థల్ని, ప్రభు త్వ, ప్రైవేట్ విద్యా కళాశాలల్ని బలోపేతం చేయాలి. వృత్త్యంతర, వృత్తిపూర్వ ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలను రెగ్యులర్‌గా నిర్వహించేంపదకు అవసరమైన నిధులను, ఉపన్యాసకుల ఖాళీల భర్తీని వేగవంతం చేయాలి. జాతీయ విద్యా విధానం 2019 అమలులో భాగంగా కేంద్రం ప్రారంభించబోతున్న పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల్ని, మన ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించాలి. నిర్బంధ ప్రాథమిక విద్య అమలులో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏండ్ల వయస్సున్న బాలబాలికలందనీ పాఠశాలల్లో చేర్పించా లి. మన ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియె ట్ స్థాయి విద్యను విలీనం చేయాలి. భౌతిక వనరులు పెంపొందించి విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా మండలానికి రెండు చొప్పున బాలబాలికలందరికీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేసి ఉన్నత విద్యను అందించాలి. ఉపాధ్యాయులందరికీ జాతీయ విద్యా ప్రణాళిక 2005, 2019 జాతీయ విద్యా ప్రణాళికలకు అనుగుణంగా పాఠ్యాంశాల, పాఠ్యపుస్తకాల రూపకల్పన చేయా లి.
dr-Anabheri-Rajeshwar-rao
వృత్తి నైపుణ్యాల పెంపు, కంప్యూటర్ వినియోగం, డిజిటల్ లిటరసీ కార్యక్రమాలను నిర్వహించాలి. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాల్ని కాంక్షించి రాష్ట్రంలోని ప్రకృ తి, భౌతిక వనరులను ఉపయోగించి ప్రపంచంలోని విద్యా సంస్థల్లో అగ్రగామిగా రాణించగలిగే స్థాయిలో బోధన కొనసాగించాలి. జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా కళాశాల ప్రిన్సిపాల్స్‌ను సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్ని, పాఠశాలల్ని దత్తత తీసుకొని బాలబాలికల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. దీనికోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి. అలాగే రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యను పెంపొందించేందుకు నూతన విద్యా విధానం-2019 అమలులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రభు త్వ, ప్రైవేట్ విద్యా కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, డిగ్రీ కోర్సు ల్లో ఇంటిగ్రేటెట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సు (నాలుగేండ్లు)ను ప్రవేశపెట్టాలి. దీనిద్వారా భవిష్యత్ విద్యా రంగానికి పునాది వేసేలా ప్రోత్సహించాలి. రాష్ట్రంలోని పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాల్లో కూడా త్వరితగతిన మార్పు లు చేయాలి. ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తున్న వారు తమ మేధో సంపత్తిని పెంపొందించుకోవాలి. తమ జీవితకాలంలో కనీసం నాలుగు తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి నిత్య విజ్ఞానార్జన కోసం కృషి చేస్తూ విద్యార్థుల భవితకు మంచి దారులు వేయాలి. బోధనాభ్యసన కృత్యాలు అంకితభావంతో, ఆత్మవిశ్వాసంతో దృశ్య-శ్రవణ పరికరాలను ఉపయోగిస్తూ తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించా లి. జీవనోపాధి కోసం కాకుండా అంకితభావంతో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేందుకు ఇష్టపడే వారే వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సాహాకాలు అందించాలి.

414
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles