రాజమండ్రి రైలెక్కి..

Fri,October 18, 2019 12:22 AM

దర్శకనిర్మాణ వ్యవహారాల్ని ఒక్కరే చేపట్టడం సులభం కాదు. పాటలు, ప్రచార చిత్రాలు చూస్తుంటే సుమన్‌బాబు ఆ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించినట్లు కనిపిస్తున్నది అని అన్నారు దర్శకుడు బాబీ. శ్రీకాంత్, సాయితేజస్విని, కారుణ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎర్రచీర. సి.హెచ్.సుమన్‌బాబు దర్శకనిర్మాత. ఈ చిత్రంలోని రాజమండ్రి రైలెక్కి చెక్కేస్తారు అనే గీతాన్ని బుధవారం హైదరాబాద్‌లో దర్శకుడు బాబీ విడుదలచేశారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ మదర్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న హారర్ చిత్రమిది. అఘోరగా శ్రీకాంత్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. డిసెంబర్ 27న సినిమాను విడుదల చేయనున్నాం అని తెలిపారు. భిన్న ఎమోషన్స్‌తో సాగే కథ ఇదని, ప్రతి పాత్ర ఆసక్తిని పంచుతుందని నటుడు గురురాజ్ చెప్పారు. నవ్యమైన ఇతివృత్తాలతో ఔత్సాహిక దర్శకులు సినిమాలు చేస్తూ విజయాల్ని అందుకుంటున్నారని, సుమన్‌బాబు ఆ కోవలో చేరుతాడనే నమ్మకముందని మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రమోద్, గోపీ తదితరులు పాల్గొన్నారు.

330

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles