సవాళ్లను స్వీకరిస్తా!

Sun,November 17, 2019 12:02 AM

కేరింత మనమంతా జెర్సీ చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు యువనటుడు విశ్వంత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తోలు బొమ్మలాట ఈ నెల 22న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా విశ్వంత్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ఇప్పటివరకు ఎవరూ స్పృశించని విభిన్నమైన పాయింట్‌తో తోలు బొమ్మలాట చిత్రం తెరకెక్కింది. జీవన ప్రయాణంలో మనుషులు ఎలా మారిపోతారు అనే కాన్సెప్ట్‌ను చర్చిస్తూ సాగే చిత్రమిది. ఇందులో గొప్పదిరా మనిషి పుట్టుక అనే ఓ పాట ఉంది. సినిమాలోని భావాన్ని మొత్తం ఆవిష్కరించే గీతమది. ఎప్పటికైనా అందరం వెళ్లిపోవాల్సిందే. మధ్యలో జరిగే నాటకమే జీవితం అనే లైన్‌లో సినిమా ఉంటుంది. బావ, మరదలి ప్రేమ..వారిద్దరికి పెళ్లిచేయాలనుకునే తాత..ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాలే సినిమా కథాంశం. పాత్రలపరంగా సవాళ్లను స్వీకరిస్తా. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాను. వీటి తర్వాత భవ్య క్రియేషన్స్‌లో థ్రిల్లర్ కాన్సెప్ట్ చేస్తున్నాను. ఇందులో సోలో హీరోగానే కనిపిసా అన్నారు.

158

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles