ఆకాంక్ష నెరవేర్చిన చిత్రమిది!

Sat,October 19, 2019 12:03 AM

బిత్తిరిసత్తితో చాలా కాలంగా పరిచయముంది. బుల్లితెరపై అందరిని ఎంటర్‌టైన్ చేస్తున్న సత్తి ఇప్పుడు వెండితెరపై అడుగుపెడుతున్నాడు. రెండు గంటల పాటు వినోదాన్ని పంచడానికి తుపాకిరాముడుతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు అని అన్నారు విజయ్ దేవరకొండ. బిత్తిరిసత్తి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తుపాకిరాముడు. రసమయి ఫిల్మ్స్ పతాకంపై శాసనసభ్యుడు, నిర్మాత రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియ కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను గురువారం హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా అమ్మానాన్నలు సత్తి వీడియోలు చూస్తూ ఒత్తిడి నుంచి దూరమవుతుంటారు. ఈ చిత్ర టీజర్, పాటలు బాగున్నాయి. తెలంగాణ సంస్కృతి, పల్లె జీవన విధానంతో ముడిపడిన కథ కావడంతో రసమయి బాలకిషన్ ఈ సినిమాను నిర్మించినట్లుగా కనిపిస్తున్నది.


ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలి అని అన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ చక్కటి సాంస్కృతిక విలువలతో కూడిన సినిమా తీయాలన్న ఎన్నో రోజుల ఆకాంక్ష ఈ చిత్రంతో తీరింది. చిత్రసీమకు బంగారుకొండగా మారిన విజయ్ దేవరకొండ మా టీజర్‌ను విడుదలచేయడం ఆనందంగా ఉంది. బిజీ షెడ్యూల్‌లో కూడా తన విలువైన సమయం కేటాయించి మమ్మల్ని ప్రోత్సహించారు. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే ఆలోచనను పక్కనపెట్టి మంచి సినిమాను ప్రేక్షకులకు అందించిన పేరు తనకు దక్కుతుందనే ఆలోచనతో దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు. బిత్తిరి సత్తి మాట్లాడుతూ ఇతరుల్ని అనుసరించకుండా తనకంటూ తెలుగు చిత్రసీమలో సొంత ట్రెండ్‌ను సృష్టించుకుంటున్నారు విజయ్‌దేవరకొండ. స్టార్ హీరోలు సైతం తన పంథాను అనుసరించేలా చేశారు. ఆయన చేతుల మీదుగా మా సినిమా టీజర్ విడుదలకావడం సంతోషాన్నిచ్చింది అని అన్నారు. కష్టపడి తాను చేసిన సినిమా ఇదని కథానాయికగా చక్కటి శుభారంభాన్ని అందిస్తుందనే నమ్మకం ఉందని ప్రియ చెప్పింది.

817

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles