బాక్సర్‌గా విజయ్?


Tue,August 20, 2019 12:29 AM

Vijay Devarakonda next with Kranthi Madhav goes on floors

విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించబోతున్నారు. నిజజీవితంలో ధిక్కార స్వభావంతో, నిర్మొహమాటంగా తమ మనసులోని భావాల్ని వ్యక్తం చేయడం పూరి జగన్నాథ్, విజయ్‌దేవరకొండ నైజం. ఆటిట్యూడ్ విషయంలో ఎన్నో సారూప్యతలున్న వీరిద్దరు కలిసి సినిమా చేయబోతుండటం సినీ ప్రియుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తున్నది. తన కుటుంబ లక్ష్యం కోసం ఓ శక్తివంతుడు, యుక్తిపరుడైన బాక్సర్ చేసిన ప్రయాణమేమిటన్నదే చిత్ర ఇతివృత్తమని సమాచారం.

పవర్‌ఫుల్ యాక్షన్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ మేళవింపుతో ఈ కథాంశం ఉంటుందని చెబుతున్నారు. విజయ్‌దేవరకొండను మునుపెన్నడూలేని విధంగా నవ్యమైన పంథాలో ఆవిష్కరించేందుకు పూరి జగన్నాథ్ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నారు విజయ్‌దేవరకొండ. చిత్రీకరణ జరుగుతున్నది.

407

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles