ఇంట్రెస్టింగ్‌ ‘మిస్‌ మ్యాచ్‌'

Thu,July 11, 2019 11:29 PM

ఉదయ్‌శంకర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌'. ఎన్‌.వి.నిర్మల్‌కుమార్‌ దర్శకుడు. ఐశ్వర్యారాజేష్‌ కథానాయిక. జి.శ్రీరామరాజు, భరత్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని హీరో వెంకటేష్‌ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మిస్‌ మ్యాచ్‌' టీజర్‌ ఆసక్తికరంగా వుంది. మిస్‌ మ్యాచ్‌ కుటుంబ సభ్యులంతా చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్‌శంకర్‌కు నటుడిగా మంచి భవిష్యత్తు వుంది. ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’ అన్నారు. ఉదయశంకర్‌ మాట్లాడుతూ ‘ భూపతిరాజా అందించిన కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడుకుండా నిర్మించారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్‌.వి.నిర్మల్‌కుమార్‌, శ్రీరామరాజు,భూపతిరాజా తదితరులు పాల్గొన్నారు.

672

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles