1980 నేపథ్య గీతం..

Sat,November 16, 2019 12:11 AM

వెంకటేష్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వెంకీమామ. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకుడు. రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్ కథానాయికలు. నేడు ఈ సినిమాలోని రెండో గీతాన్ని విడుదల చేయబోతున్నారు. ఎన్నాళ్లకో.. అనే పల్లవితో సాగే ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో వింటేజ్ లుక్‌లో వెంకటేష్, పాయల్‌రాజ్‌పుత్ ఆకట్టుకుంటున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రెట్రోసాంగ్ ఇది. తమన్ స్వరాల్ని సమకూర్చారు.


అలనాటి జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తూ అందరిని అలరించే గీతమవుతుంది. రియల్‌లైఫ్‌లో మామాఅల్లుైళ్లెన వెంకటేష్, నాగచైతన్య రీల్‌లైఫ్‌లో కూడా అవే పాత్రల్లో చక్కటి వినోదాన్ని పండించారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. మామ అంటే అమితమైన ప్రేమ కలిగిన అల్లుడు కథ ఇది. అనుబంధాలు, విలువలకు దర్పణంలా ఉంటుంది. పల్లెటూరు, ఆర్మీ నేపథ్యంలో సాగే వినూత్న కథ ఇది అని చిత్రబృందం తెలిపింది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: తమన్, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర (బాబీ).

693

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles