ఆహార మాఫియాపై పోరాటం

Mon,October 7, 2019 12:11 AM

ఆహారకల్తీ మాఫియాపై పోరాడే ఓ ధైర్యవంతుడైన యువకుడి కథ ఇది. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిణామాలు ఉత్కంఠను పంచుతాయి అని అన్నారు టి. అంజయ్య. ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం వదలడు. సిద్ధార్థ్, కేథరిన్ జంటగా నటించారు. సాయిశేఖర్ దర్శకుడు. టి.నరేష్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మాతలు. ఈ నెల 11న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. అంజయ్య మాట్లాడుతూ వాసన గ్రహించలేని రుగ్మతతో బాధపడే యువతిగా కేథరిన్ పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. కథాబలమున్న మంచి చిత్రాల్ని ప్రేక్షకులకు అందించాలనే సదుద్దేశ్యంతో పారిజాత సంస్థను స్థాపించాం. వచ్చే ఏడాది మా సంస్థ ద్వారా ఆరు స్ట్రెయిట్ సినిమాల్ని విడుదలచేయబోతున్నాం అన్నారు. వాణిజ్య విలువలతో రూపొందుతున్న సందేశాత్మక చిత్రమిది. 450 థియేటర్లలో సినిమాను విడుదలచేయనున్నాం. కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అని నిర్మాతలు పేర్కొన్నారు. హారర్ కథతో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రమిదని నట్టికుమార్ పేర్కొన్నారు.

316

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles