తూనీగ గీతావిష్కరణ


Tue,August 6, 2019 12:51 AM

tooneega movie audio launched

వినీత్‌చంద్ర, దేవయానీశర్మ జంటగా నటించిన చిత్రం తూనీగ (ఒక దైవరహస్యం). ప్రేమ్‌సుప్రీమ్ దర్శకుడు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. బిగ్‌సీడీని నిర్మాత రాజ్‌కందుకూరి ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ క్రౌడ్‌ఫండింగ్ విధానం ద్వారా ఈ చిత్రాన్ని పూర్తిచేశాను. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, శ్రీకాకుళంలో చిత్రీకరణ జరిపాం. భారతీయ సంస్కృతిలోని అనేక అంశాలను తీసుకొని తాత్విక భూమికతో పురాణేతిహాస ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సిద్ధార్థ్ సదాశివుని అద్భుతమైన సంగీతాన్నందించారు అన్నారు. ఈ మధ్య విడుదలైన చిన్న చిత్రాలు మంచి విజయాల్ని సాధించాయని, అదే కోవలో ఈ సినిమా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని రాజ్ కందుకూరి చెప్పారు.

246

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles