గొప్ప అధికారులకు ఇచ్చే గౌరవమిది!

Sat,September 14, 2019 11:29 PM

‘దేశానికి సేవ చేసిన వారెవరూ వేదికల మీదకు ఎప్పుడూ రారు. ఎలాంటి గుర్తింపును కోరుకోకుండా తమ బాధ్యతల్ని నెరవేరుస్తుంటారు. ఆ హీరోలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ ‘బందోబస్త్‌' చిత్రం’ అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకులముందుకురానుంది. కె.వి.ఆనంద్‌ దర్శకుడు. సుభాస్కరణ్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఎన్వీఆర్‌ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ‘నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాలో నేను ఎన్‌ఎస్‌జీ కమెండోగా నటించా. మనదేశ భద్రత కోసం ఎంతో మంది పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం వాళ్లను నేను వ్యక్తిగతంగా కలవడం గొప్ప అనుభవాన్నిచ్చింది. ఎన్‌ఎస్‌జీ కమెండోల ఉద్యోగం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం. వాళ్లు కుటుంబ జీవితాలను త్యాగం చేస్తారు. అటువంటి గొప్ప అధికారులకు ఇచ్చే గౌరవం ఈ సినిమా. సందేశంతో పాటు వినోదప్రధానంగా అందరిని అలరిస్తుంది’ అన్నారు. ‘ఈ సినిమా సూర్య కెరీర్‌లో పెద్ద విజయంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది.


కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహించిన ‘రంగం’ సినిమాకు తిరుపతిలో నేను శతదినోత్సవ వేడుక నిర్వహించాను. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడాయన. ‘బందోబస్త్‌' చిత్రాన్ని అద్భుతంగా రూపొందించాడు. ఈ సినిమా తెలుగులో సూర్య మార్కెట్‌ను మరింత విస్త్రతం చేస్తుందని భావిస్తున్నా’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ చెప్పారు. కె.వి.ఆనంద్‌ మాట్లాడుతూ ‘సూర్యతో పనిచేయడం గొప్ప అనుభూతి. ప్రతి పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయాలని తపిస్తారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ ప్రధానమంత్రి పాత్రలో నటించారు. హ్యారీస్‌ జైరాజ్‌ చక్కటి స్వరాలతో పాటలిచ్చారు. సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు’ అన్నారు. సూర్యతో పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకున్నానని ఆర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయిక సయేషాసైగల్‌, ఠాగూర్‌ మధు, సురేష్‌బాబు, గౌతమ్‌ తిన్ననూరి తదితరులు పాల్గొన్నారు.

305

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles