సెప్టెంబర్ 20న బందోబస్త్


Mon,August 5, 2019 12:51 AM

Surya releases Bandobust on September 20

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం కాప్పాన్. కె.వి.ఆనంద్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఆర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయేషా సైగల్ కథానాయిక. ఈ చిత్రాన్ని బందోబస్త్ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ విడుదల చేసిన తమిళ వెర్షన్ పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే తెలుగులో విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. త్వరలో తెలుగు వెర్షన్ పాటల్ని విడుదల చేయబోతున్నాం. త్వరలో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో ప్రీరిలీజ్ వేడుకని నిర్వహించనున్నాం.

విభిన్నమైన గెటప్‌లలో సూర్య నటన, కథకు కీలకమైన ప్రధాని పాత్రలో పాకిస్తాన్ తీరును ఎండగడుతూ మోహన్‌లాల్ చెప్పిన సంభాషణలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. బోమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరీష్ జైరాజ్, రచన: పి.కె.పి., శ్రీరామకృష్ణ, పాటలు: చంద్రబోస్, వనమాలి, ఆర్ట్: డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్: ఆంటోని, ఛాయాగ్రహణం: ఎం.ఎస్.ప్రభు.

573

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles