నువ్వెళ్లే రహదారికి జోహారూ..


Fri,August 9, 2019 11:45 PM

story happy birthday mahesh babu makers of sarileru neekevvaru treat fans with teaser

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దిల్‌రాజు, అనిల్ సుంకర, మహేష్‌బాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం హీరో మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు ఆర్మీ అధికారి ఆజయ్ కృష్ణగా కనిపించనున్నారు. సరిలేరు నీకెవ్వరు...నువ్వెళ్లే దారికి జోహారూ.. సరిలేరు నీకెవ్వరు..ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు.. అంటూ టీజర్‌లో సాగే పాట సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

టీజర్‌లో సైనికుడిగా మహేష్‌బాబు మరింత ైస్టెలిష్‌గా కనిపించడం ఆయన అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర నవ్యపంథాలో ఉంటుందని, మునుపెన్నడూ లేనవిధంగా భిన్నకోణాల్లో సాగుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే కశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది చితాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక పాత్రలో విజయశాంతి నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్.

664

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles