పోలీస్, రేసర్ వార్!


Tue,August 6, 2019 12:52 AM

Siddhartha and Jeevi Prakash Red Yellow Emerald

సిద్ధార్థ, జీవీ ప్రకాష్ కథానాయకులుగా బిచ్చగాడు దర్శకుడు శశి దర్శకత్వంలో తమిళంలో సివప్పు మంజల్ పచ్చై పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎరుపు పసుపుపచ్చ పేరుతో అభిషేక్ ఫిల్మ్స్ పతాకంపై రమేష్ పిైళ్లె విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఒక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌కి, ఒక బైక్ రైసర్‌కి మధ్య సాగే ఎమోషనల్ వార్ చిత్రమిది. మంచి భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారిని మెచ్చే అంశాలున్నాయి. సెప్టెంబర్ ప్రథమార్ధంలో తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ చిత్రాన్ని విడుదల చేస్తాం. అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ బిచ్చగాడు తరువాత నా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలుంటాయి. అన్ని భావోద్వేగాల మేళవింపుతో వస్తున్న ఈ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతాననే విశ్వాసం వుంది. సిద్ధార్థ పాత్ర చిత్రణ ఆకట్టుకుంటుంది అని తెలిపారు. కాశ్మీర పరదేశి, లిజిమోల్ జోస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధుకుమార్.

478

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles