హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి

Tue,September 17, 2019 12:09 AM

ప్రయోగాలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది బాలీవుడ్ నటి విద్యాబాలన్. సవాళ్లతో కూడిన పాత్రల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతుంటుంది. తాజాగా ఆమె మరో వినూత్నమైన పాత్రలో కనిపించబోతున్నది. ప్రఖ్యాత భారతీయ గణితమేధావి, హ్యూమన్ కంప్యూటర్‌గా పేరుపొందిన శకుంతలాదేవి జీవిత కథా చిత్రం శకుంతలాదేవిలో నటించబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో ఎర్రచీర ధరించి షార్ట్‌హెయిర్ కట్‌తో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నది విద్యాబాలన్. అద్భుతమైన జ్ఞానం, కాస్త గర్వం, వ్యంగ్యం కలబోసిన గణిత మేధావి అంటూ టీజర్‌లో విద్యాబాలన్ పాత్ర గురించి అభివర్ణించారు. సోమవారం లండన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అనూమీనన్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శకుంతలాదేవి గణితంలో అద్భుత ప్రతిభాసంపత్తురాలిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. 1982లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. రచయితగా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది.

372

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles