జనగణమన సైనికుడు


Tue,August 20, 2019 12:32 AM

Sarileru Neekevvaru Mahesh Babu New Movie release this Sankranthi 2020

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్‌రాజు సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన్న కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. మహేష్‌బాబు, విజయశాంతి, రష్మిక మందన్నతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. సైనికుల త్యాగాల్ని కీర్తిస్తూ ఇటీవలే చిత్రబృందం భగభగభగ మండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు.. అనే వీడియో గీతాన్ని విడుదలచేసింది. 1971 ఇండో-పాక్ యుద్ధం, 1984 సియాచిన్‌ఘటన, 1999కార్గిల్ యుద్ధం, 2016లో సర్జికల్స్ ైస్ట్రెక్స్‌లలో పాల్గొన్న సైనికుల ధైర్యసాహసాల్ని కొనియాడుతూ ఈ పాటను విడుదలచేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమాలో మహేష్‌బాబు సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన నటన, పాత్ర చిత్రణ శక్తివంతంగా ఉంటాయి. హీరోగా ఆయన్ని కొత్త పంథాలో ఆవిష్కరించే సినిమా ఇది. 2020 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.

658

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles