ఉత్కంఠగా ‘సమరం’

Mon,December 2, 2019 10:51 PM

సాగర్‌గంధం, ప్రగ్యానయన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సమరం’. బషీర్‌ ఆలూరి దర్శకుడు. యూనివర్సల్‌ ఫిలింస్‌ పతాకంపై శ్రీనివాస్‌ వీరంశెట్టి, జీవీఎస్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథానుగుణంగా టైటిల్‌ పెట్టాం. అన్ని కమర్షియల్‌ హంగులతో మెప్పిస్తుంది. ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. సుమన్‌, వినోద్‌కుమార్‌, సత్యప్రకాష్‌, జహీదా, ప్రియాన్షు, సహానా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నాగబాబు, సంగీతం: రాజ్‌కిరణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బషీర్‌ ఆలూరి.

206

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles